Monday, April 19, 2021

Latest Posts

బాటిల్స్‌తో కొట్టి చంపేస్తారా ?: ప‌్ర‌కాష్ రాజ్‌ షాకింగ్ కామెంట్స్

Prakash Raj SERI0US Warning On Rahul Sipligunj Issue In Prism Pub:

ఇటీవ‌ల గ‌చ్చిబౌళిలోని ప్రిజ‌మ్ ప‌బ్‌లో సింగ‌ర్‌, బిగ్‌బాస్ 3 విన్న‌ర్ రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి జరగడం, తీవ్రంగా గాయపడడం తెలిసిందే. తాండూరు ఎమ్యెల్యే బంధువులు రితేష్ రెడ్డి స‌హా అత‌ని స్నేహితులు రాహుల్‌పై దాడి చేయ‌డ‌మే కాకుండా అత‌ని త‌ల‌పై బీరు బాటిల్స్‌తో దాడి చేశారు. ఆ వీడియో ఫుటేజ్ కూడా బ‌య‌ట‌కు వచ్చి, సంచలనం సృష్టించింది.
త‌న‌కు న్యాయం చేయాలంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా రాహుల్ మంత్రి కేటీఆర్‌కు విజ్ఞ‌ప్తి కూడా చేసాడు.

ఇక ఈ ఘ‌ట‌న‌పై న‌టుడు ప్ర‌కాష్ రాజ్ స్పందిస్తూ, రాహుల్ సిప్లిగంజ్‌కు ప్ర‌ముఖ త‌న మ‌ద్ద‌తు తెలిపారు. ఈవిషయంలో రాహుల్‌కు అన్యాయం జ‌రిగింద‌న్నారు. ప‌బ్‌కు వెళ్ల‌డం త‌ప్పు కాద‌ని, ప‌ది మంది కలిసి ఒక‌డిని కొట్ట‌డం త‌ప్ప‌ని ప్ర‌కాష్ రాజ్‌ అన్నారు.

సంఘటన చూస్తుంటే, ఈ గొడ‌వ‌లో రాహుల్‌ది త‌ప్పేమీ లేద‌ని, పోలీసు ఉన్న‌తాధికారుల‌తో మాట్లాడుతాన‌ని ప్రకాష్ రాజ్ అన్నారు. త‌ప్పు లేన‌ప్పుడు ఎందుకు కాంప్ర‌మైజ్ కావాల‌ని ప్ర‌శ్నించారు . రాహుల్‌పై క‌క్ష‌తో గొడ‌వ జ‌ర‌గ‌లేద‌ని అన్నారు. వీడియో చూస్తే బాటిల్స్ కొడుతున్నారు. బాటిల్‌తో కొట్టి చంపేస్తారా..ఏంటి? అదేం ధైర్యం? ఇద్ద‌రు మ‌ధ్య గొడ‌వ‌లు, బిన్నాభిప్రాయాలు ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి కానీ.. దాడి చేయడం ఏమిటి”అని ప్ర‌శ్నించారు. న్యాయం కోసం పోరాడుతాన‌ని ప్రకటించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss