Saturday, January 16, 2021

Latest Posts

మారుతీరావు ఆత్మహత్యకు కారణం ఏమిటి?

Pranay Case Accused Maruthi Rao Commits Suicide:

కూతురు వేరే వ్యక్తిని పెళ్లిచేసుకుందని ఆగ్రహించి అల్లుడ్ని హత్యచేయించాడన్న ఆరోపిణలు ఎదుర్కొంటున్న మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంచలనంగా మారిన మారుతిరావు ఆత్మహత్య ఉదంతం వెనుక అసలేం జరిగింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. రెండు రోజులు హైదరాబాద్ లో ఉండేందుకు రూం తీసుకున్న ఆయన.. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు? అన్నది ఒక ప్రశ్న అయితే.. హైదరాబాద్ కు కారులో వచ్చే సమయంలోనూ తన కుమార్తె ఫోటోల్ని చూసుకుంటూ మారుతిరావు వచ్చినట్లుగా చెబుతున్నారు.మారుతిరావు ఆత్మహత్య వెనుక వేధింపులే కారణంగా చెబుతున్నారు.

Maruthi rao

ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ.. ఎస్టీ కోర్టులో ట్రయల్స్ మొదలు కావటం.. ఈ హత్య కేసులో శిక్ష తప్పదన్న అంశంపై తీవ్రమైన మనస్తాపానికి గురైనట్లుగా చెబుతున్నారు. వారం క్రితం తనకున్న ఆస్తుల్ని భార్యపేరుతో వీలునామా చేసినట్లుగా సమాచారం. తమ్ముడు శ్రవణ్ కుమార్ తో ఆస్తి పంపకాలు పూర్తి చేసుకున్నారు. ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్న అబ్దుల్ బారీ.. సుభాష్ శర్మల నుంచి మారుతిరావుకు వేధింపులు అధికంగా ఉండేవని, తమకు శిక్ష ఖాయమన్న నాటి నుంచి వారు పెద్ద ఎత్తున డబ్బును డిమాండ్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

Sucide case maruthirao

ఈ కారణంతోనే మారుతిరావు ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అంచనా వేస్తున్నారు. ఆయన ఆత్మహత్య జరిగిన తీరు చూస్తే.. విషం తాగిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆయన బస చేసిన గదిలో పెద్ద రక్తపు వాంతి చేసుకొని ఉండటం, ముఖం రంగు మారిపోవటం, ముఖానికి చేతులు అడ్డు పెట్టుకొని చనిపోయారు. ఎప్పుడూ ధీమాగా ఉండే మారుతిరావు ఎందుకు ఆత్మహత్య చేసు కున్నాడో అర్ధం కావడంలేదని అంటున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss