Sunday, June 20, 2021

Latest Posts

ఎన్‌టి‌ఆర్ ప్రశాంత్ నీల్ సినిమా కి రంగం సిద్ధం

Prashanth Neel Confirms NTR Collaboration For NTR 31st Film

కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి జూనియర్ ఎన్‌టిఆర్ చిత్రంపై ప్రకటన కోసం యంగ్ టైగర్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ విషయం పై స్పష్టత రావడంతో ఎన్‌టి‌ఆర్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

“రక్తంలో ముంచిన నేల మాత్రమే గుర్తుంచుకోవలసినది !! దాన్ని ఎన్‌టి‌ఆర్ వంటి ఫోర్స్ తో తడపడానికి ఇంక ఎంతో సమయం లేదు. ఎన్‌టి‌ఆర్ తో కలిసి 31వ చిత్రం చేయబోతున్నాను. నీతో కలవడం ఎంతో ఆనందంగా ఉంది. సేఫ్ హ్యాపీ బర్త్డే బ్రదర్” అని దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ ప్రకటనతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నందమూరి అభిమానులకు ఇంకో సంతోషకర విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని మైత్రీ మేకర్స్ తో పాటు హీరో నందమూరి కళ్యాణ్ రామ్ యొక్క ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కూడా కలిసి ఈ సినిమాని నిర్మించబోతున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss