Sunday, June 20, 2021

Latest Posts

కే‌జి‌ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రెమ్యూనరేషన్ ఎంత అంటే?

KGF Director Prashanth Neel Remuneration

శాండల్ వుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెలియని వారు ఎవరైనా ఉన్నారా? 2018 లో విడుదలైన ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ చిత్రం తర్వాత ఆయన పేరు ఇండియా మొత్తం మారు మ్రోగింది. ఈ చిత్రంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో నటించారు మరియు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది.

కెజిఎఫ్ తరువాత, ప్రశాంత్ నీల్ ఇప్పుడు తన దృష్టిని టాలీవుడ్ వైపు మళ్లించి, తెలుగు నటులతో కలిసి పనిచేయడానికి గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. ఇప్పటికే, ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో కలిసి ‘సాలార్’ చిత్రానికి పని చేస్తున్నారు. మరోవైపు, జూనియర్ ఎన్‌టి‌ఆర్ తో కొత్త సినిమా కోసం అసోసియేట్ చేయనున్నట్లు ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చిత్రం వచ్చే ఏడాదిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు, వరుసగా సినిమాలు చేస్తున్న ప్రశాంత్ రెమ్యూనరేషన్ ఎంత ఉంటుంది అనేది సోషల్ మీడియాలో హల్చల్ గా మారింది.

ప్రశాంత్ నీల్ సినిమా కోసం పెద్ద డైరక్టర్లు తీసుకునే దాని కంటే తక్కువే తీసుకుంటున్నాడని సమాచారం. అందుకే నిర్మాతలు అతని కోసం క్యూ కడుతున్నారని తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ తారక్ చిత్రానికి పారితోషికంగా పది కోట్లు చెల్లిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలావుండగా, ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ చిత్రం జూలై 16, 2021న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss