Tuesday, April 13, 2021

Latest Posts

ఎండ తీవ్రంగా ఉన్నపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

ఎండ తీవ్రంగా ఉన్నపుడు తీసుకోవలసిన జాగ్రత్తలును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలియచేసింది.

చేయవలసినవి
*  వేడిగా ఉన్న రోజులలో తప్పనిసరిగా గొడుగు వాడాలి.
*  తెలుపురంగు గల పలుచటి కాటన్ వస్త్రాలను ధరించాలి.
*  నెత్తికి టోపీ, లేదా రుమాలు పెట్టుకోవాలి.
* ఉప్పు కలిపిన మజ్జిగ లేదా గ్లూకొజు కలిపిన నీరు త్రాగవచ్చును, లేదా ఓరల్ రి హైడ్రేషన్ ద్రావణము త్రాగవచ్చును.
* వడదెబ్బకు గురి అయినవారిని శీతల ప్రాంతానికి వెంటనే చేర్చాలి.
* వడదెబ్బకు గురి అయినవారని తడిగుడ్డతో శరీరం అంతా రుద్దుతూ ఉండాలి. ఐస్ నీటిలో బట్టను ముంచి శరీరం అంతా తుడవవలెను శరీర ఉష్ణోగ్రత 101 F* – డిగ్రీస్ కంటే లోపునకు వచ్చేవరకు ఐస్ వాటర్ బట్టతో శరీరాన్ని తుడుస్తూ ఉండాలి మరియు ఫ్యాను క్రింద ఉంచాలి.
* వడదెబ్బకు గురి అయినవారిలో మంచి మార్పులు లేనిచో శీతల వాతావరణంలో దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించవలెను.
* మంచి నీరు ఎక్కువ సార్లు త్రాగాలి.
* ఇంటి నుంచి బయటకు వెళ్ళేముందు ఒక గ్లాసుమంచి నీరు త్రాగాలి.
* ఎండలో బయటి నుంచి వచ్చిన వెంటనే ఒక మాదిరైన చల్లని నిమ్మరసముగాని, కొబ్బరి నీరు లేదా చల్లని నీరు త్రాగాలి.
* తీవ్రమైన ఎండలో బయటకి వెళ్ళినప్పుడు తలతిరుగుట మొదలైన అనారోగ్య సమస్య ఏర్పడితే దగ్గరలో వున్నా వైద్యుణ్ణి సంప్రదించి ప్రాధమిక చికిత్స పొంది వడ దెబ్బ బారిన పడకుండా కాపాడుకోవచ్చును.

చేయకూడనివి

* సూర్య కిరణాలకు, వేడి గాలికి గురి కాకుడదు.
* వేడిగా ఉన్న సూర్య కాంతిలో గొడుగు లేకుండా తిరుగరాదు.
* వేసవి కాలంలో నలుపురంగు దుస్తులు, మందంగా ఉండే దుస్తులు ధరించరాదు.
* నెత్తికి టోపి లేక రుమాలు లేకుండా సూర్య కాంతిలో తిరుగరాదు.
* వడదెబ్బకు గురి అయిన వారిని వేడి నీటిలో ముంచిన బట్టతో తుడువరాదు.
దగ్గరలోని ప్రాధమిక అరోగ్య కేంద్రానికి చేర్చుటలో ఏ మాత్రం అలస్యం చేయరాదు.
* మధ్యాహ్నం తరువాత (అనగా ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల మధ్యకాలంలో) ఆరుబయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పని పనిచేయరాదు.
* ఎండలో బయట నుంచి వచ్చిన వెంటనే తీపిపదార్ధములు మరియు తేనె తీసుకొన కూడదు.
శీతలపానీయములు, మంచు ముక్కలు తీసుకుంటే గొంతుకు సంబంధించిన అనారోగ్యము ఏర్పడుతుంది.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss