Preity Zinta Family Got Corona
ఒకప్పుడు టాలీవుడ్ లో మెరిసిన హీరోయిన్ ప్రీతి జింటా కుటుంబానికి మూడు వారాల క్రితం కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఆమె తల్లి, తమ్ముడు, అతడి భార్య, పిల్లలు కరోనా మహమ్మారి బారినపడ్డారు. తాజాగా వారందరూ కరోనాను జయించారు.
ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రీతిజింటా మూడు వారాల క్రితం మా తల్లి, సోదరుడు, అతడి భార్య, పిల్లలు కరోనా బారినపడ్డారు. వారు వెంటిలేటర్‌పై చికిత్స పొందారు. నేను అమెరికాలో ఉండటం వల్ల ఏ విధంగా సాయం చేయలేకపోయాను. వారికి నెగిటివ్ వచ్చిందని తెలిసిన తర్వాత ఊపిరి పీల్చుకున్నా. అలాగే అభిమానులు కరోనాను తేలికగా తీసుకోవద్దని కోరింది ఈ సొట్ట బుగ్గల సుందరి. అందరూ కూడా సురక్షితంగా ఉంటూ మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించింది.
ఇవి కూడా చదవండి: