President Donald Trump getting ready for elections :
కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం అతలాకుతలం చేస్తున్న వేల, అమెరికాలో కూడా దీన్ని ఎఫెక్ట్ ఊహించని విదంగా ఉండి చాలా మంది ప్రజలు దీని బారిన పడుతున్నారు. 10 లక్షల కరోనా పసిటివ్ కేసులు అమెరికాలో నమోదు కాగా, 10 వేల మందికి పైగా మరణించడం జరిగింది. కాగా తాజాగా అమెరికా కరోనా నుంచి పూర్తి విముక్తి సాదించలేకపోయినా ప్రస్తుతం కొనసాగిస్తున్న లాక్ డౌన్ ను కొనసాగిస్తూ కొన్ని సడలింపులు చేయనుంది. ప్రధానంగా డోమెస్టిక్ ఫ్లైట్స్ కు వచ్చే వారం నుంచి అనుమతి ఇవ్వాలని ట్రంప్ నిర్ణయించినట్టు తెలుస్తుంది.
కాగా కరోనా వల్ల ఎక్కడికక్కడ స్తంబించిన ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టే దశలో ఈ నిర్ణయ ఉద్దేశ్యం అని వైట్ హౌస్ నుంచి వినిపిస్తున్న మాట. ప్రస్తుతం కాగా త్వరలో ఎన్నికలు అమెరికాలో ఉండడం వలన లాక్ డౌన్ సడలింపులు చేసి, తాను కూడా మొట్ట మొదటి సారి ఆరిజోనా స్టేట్ కి వెళ్ళి తాను అవలంబించిన విదానాన్ని సమద్దించుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారని, ఎన్నికలను వాయిదా వెయ్యమని చెప్పినా ట్రంప్ మాత్రం ఇవేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు నుంచి వినిస్పిస్తుంది.