Wednesday, December 1, 2021

Latest Posts

దేశ ప్రజలకు రాష్ట్రపతి స్వాతంత్ర్య దినోత్సవ సందేశం

President Kovind addresses the nation

75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ శనివారం జాతిని ఉద్దేశించి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రసంగించారు. ఈ యేడాది స్వాతంత్ర్య దినోత్సవం చాలా ప్రత్యేకమైదని, ఈ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నామని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల సమున్నత పోరాటాలతోనే భారతావనికి స్వాతంత్ర్యం సిద్ధించిందని, వారి త్యాగాలను మనం సదా స్మరించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారి గురించి మాటలాడుతూ కరోనాపై పోరు ఇంకా ముగియలేదు. కరోనాను ఎదుర్కోవడంలో భారత్ తనవంతు పాత్ర పోషించింది. కరోనా టీకాలు మహమ్మారిని నియంత్రించాయి. కరోనా కట్టడికి వ్యూహాత్మకంగా వ్వవహరించాం అని రాష్ట్రపతి కోవింద్ అన్నారు.

కాగా వ్యవసాయ మార్కెటింగ్‌లో తీసుకువచ్చిన పలు సంస్కరణలతో రైతులకు మరింత సాధికారత చేకూరిందని తద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు రైతులకు మెరుగైన దర లభిస్తుందని చెప్పారు.  నైపుణ్యాలను కలిగిన చిన్నారులను, కుమార్తెలను గుర్తించి వారు ఉన్నతస్ధానాలకు చేరుకునేలా ప్రోత్సహించాలని తల్లితండ్రులకు విజ్ఞప్తి చేశారు. భారత భవిష్యత్‌లో బాలికలు, మహిళలకు ప్రాధాన్యత మరింత పెరుగుతుంది అని తెలిపారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss