ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి రాష్ట్రపతి చేరుకోనున్నారు. కరోనా కారణంగా రాష్ట్రపతి పర్యటనలో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనే అందరికీ కరోనా పరీక్షలు యంత్రాంగం చేసింది. అధికారులు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. సిబ్బందిని కూడా పరిమిత సంఖ్యలో విధులు నిర్వర్తించేలా అధికారులు చెర్యలు తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: