దసరా, దీపావళి ఆఫర్లతో ఈ కామర్స్ సైట్స్ ఊరిస్తున్నాయి. ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్, అమెజాన్లో గ్రేడ్ ఇండియన్ ఫెస్టివల్ సందడి నెలకొంది. అన్ని వస్తువులపై అద్భుతమైన ఆఫర్లు ప్రకటించి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇక పండగ వేళ కొత్త టీవీ కొనాలని చాలా మంది ఆశపడుతుంటారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు తక్కువ ధరకే లభించే టీవీలపైనే దృష్టిపెడుతుంటారు. అలాంటి వారందరికీ రూ.10వేల లోపు లభించే టీవీలు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్లో అందుబాటులో ఉన్నాయి. cooca (కూకా) 32 ఇంచుల ఎల్ఈడీ స్మార్ట్ టీవీ రూ.7470 రూపాయలకే లభిస్తోంది. పండగ ఆఫర్ కింద ఫ్లిప్కార్ట్లో cooca 32 inch HD ready Smart టీవీ ధరను రూ.8,299 నిర్ణయించారు. ఐతే ఎస్బీఐ డెబిట్, క్రిడిట్ కార్డుతో కొంటే 10శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే రూ.7470కే ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్తో నడిచే ఈ టీవీ యూబ్యూట్ యాప్ను కూడా సపోర్ట్ చేస్తుంది.
ఇది కూడా చదవండి: