Sunday, May 9, 2021

Latest Posts

ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేయర్

Prithvi Shaw Six Fours In Six Balls

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ పృథ్వీ షా కేకేఆర్‌కు చుక్కలు చూపించాడు. నిన్న కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు పృథ్వీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. శివమ్‌ మావి వేసిన మొదటి ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టి అజింక్యా రహానే పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు.

కే‌కే‌ఆర్ తరపున మొదటి ఓవర్ ప్రారంభించిన మావి మొదటి బంతి ని వైడ్ గా వేశాడు. దీనితో ఈ ఓవర్ లో మొత్తం 25 పరుగులు వచ్చాయి. పృథ్వీ షా దెబ్బకు కే‌కే‌ఆర్ బౌలర్ శివమ్‌ మావి ఐపీఎల్‌లో తొలి ఓవర్‌లోనే అత్యధిక పరుగులు ఇచ్చిన జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.

ఇదే ఊపులో పృథ్వీ షా (18 బంతుల్లో 50) హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకొని ఢిల్లీ తరపున తక్కువ బంతుల్లో ఫిప్టీ సాధించి పంత్‌తో సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మొదటి స్థానంలో మోరిస్‌(17 బంతులు) ఉన్నాడు.​ ఇక 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ షా, ధావన్ చెలరేగడంతో 16.3 ఓవర్లలోనే విజయం సాధించింది. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్స్ టేబల్ లో రెండో స్థానానికి చేరింది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss