Private and corporate OP Health services will start in telugu states
మే 3వ తేదీ తర్వాత ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా ఓపీ సేవలు నిలిచి పోవడంతో రొగులు అల్లాడిపోతున్నరు. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రోగులకు కొంత మేర ఊరట లభించనుంది. ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే లాక్ డౌన్ కారణంగా ఎక్కడికి వెళ్లలో తెలియని పరిస్థితి. అందువల్ల మే 3వ తేదీ తర్వాత కొన్ని ఔట్ పేషెంట్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వఆస్పత్రుల తోపాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఓపీ తప్పనిసరి చేస్తామని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చెబుతున్నాయి.
కరోనా కారణంగా రెండు రాష్ట్రాల్లో ఔట్ పేషెంట్ సేవలు నిలిచిపోయాయి. కేవలం అత్యవసర కేసులను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. దీనితో ప్రైవేట్,కార్పొరేట్ ఆస్పత్రులు ఔట్ పేషెంట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి. కొన్ని ఆస్పత్రులు ప్రాణాపాయ కేసుల్ని కూడాతీసుకోలేదు. అత్యవసరం అయినా పట్టించుకునే నాధుడే లేకుండాపోయింది. తల్లిదండ్రులు అయితే చిన్న పిల్లలకు జ్వరం వచ్చినా కూడా చూపించే పరిస్థితి లేకపోవడంతో అల్లాడిపోయారు. ఈ పరిస్థితులు దృష్టిలో పెట్టుకునిరెండు తెలుగు రాష్ట్రాల మళ్లీ ఓపీ సేవలను పునరుద్ధరించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి.