Monday, July 26, 2021

Latest Posts

ప్రియమణి పై విపరీతమైన ట్రోలింగ్

“ది ఫ్యామిలీ మ్యాన్ 2” విజయాన్ని సాధించిన ప్రియమణి మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సూపర్ ఫిట్ మరియు బ్యూటిఫుల్ గా కనిపించే నటి అయిన ఈమె కూడా పూర్తిగా ట్రోల్స్ ని ఎదుర్కొందట. ఈ విషయాన్ని ఇంటర్వ్యూ లో వెల్లడించారు. తాను కూడా ఆన్‌లైన్ ట్రాలింగ్ కి గురైనట్లు ప్రియమణి వెల్లడించారు.

కొన్ని సంవత్సరాల క్రితం ట్రోల్స్ ఆమె జీవితాన్ని దుర్భరం చేశాయట. చాలా మంది తనను “ఆంటీ” లేదా “బ్లాక్ ఆంటీ” అని పిలిచేవారని చాలా బాధగా అనిపించేదని తెలిపింది. అంతే కాకుండా కొందరు ఆమెను “ఫాట్” అని కూడా పిలిచారని చెప్పారు. అయితే, ట్రోలింగ్ ఇప్పుడు బాగా తగ్గిందని ఆమె చెప్పారు. తాజాగా ఆమె చాలా సన్నగా మరియు అందంగా ఉందని “ది ఫ్యామిలీ మ్యాన్ 2” చూసిన ప్రజలు ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss