Tuesday, April 13, 2021

Latest Posts

ప్రియమణి దెబ్బకి నోరు మూసేసిన నెటిజన్

Priyamani Shocking Response
సోష‌ల్ మీడియాలో కొంత మంది పోక‌రీల వ‌ల్ల సినీ సెల‌బ్రిటీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మ‌హిళా న‌టులు అభ్యంత‌ర‌క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. అయితే భ‌య‌ప‌డే హీరోయిన్ల‌ను చూస్తే, భ‌య‌పెట్టే పోక‌రీల‌కు కొద‌వ లేదు. ఏ మాత్రం రివ‌ర్స్ ఎటాక్ చేసినా …తోక ముడుస్తున్నారు. అలాంటి ఘ‌ట‌న గురించి తెలుసుకుందాం.

న‌టి ప్రియ‌మ‌ణి ఇటీవ‌ల బ్లాక్ క‌ల‌ర్ దుస్తుల్లో ఒక ఫొటోషూట్‌లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేశారు. వీటిపై పాజిటివ్ కామెంట్స్ అధికంగా వ‌చ్చాయి. కానీ ఓ నెటిజ‌న్ మాత్రం త‌న శాడిజాన్ని ప్ర‌ద‌ర్శించి… ప్రియ‌మ‌ణి చేతిలో చావు దెబ్బ‌తిన్నాడు.

న‌గ్న చిత్రాన్ని పోస్ట్ చేయాలంటూ ప్రియ‌మ‌ణిని అభ్యంత‌ర‌క‌రంగా అడిగాడు. దీంతో ప్రియ‌మ‌ణికి చిర్రెత్తుకొచ్చింది. భ‌విష్య‌త్‌లో మ‌రే నెటిజ‌న్ కూడా ఇలాంటి అభ్యంత‌ర‌క‌ర ప్ర‌శ్న‌, మ‌రే న‌టిని అడ‌గ‌కుండా చేసేందుకు గ‌ట్టి స‌మాధానం ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకు న్నారామె.

ఈ నేప‌థ్యంలో ప్రియ‌మ‌ణి స్పందిస్తూ.. ‘మొదట మీ సోదరి లేదా తల్లిని న‌గ్న చిత్రాన్ని పోస్టు చేయమని అడగు.. ఆ తర్వాత నేను పోస్టు చేస్తాను’అంటూ స్ట్రాంగ్ డోస్‌తో బ‌దులిచ్చారామె. ఆమె ఆన్స‌ర్‌తో నెటిజ‌న్‌కు దిమ్మ తిరిగింది.

తప్పు చేశాన‌ని గ్ర‌హించిన స‌ద‌రు నెటిజ‌న్ ప్రియ‌మ‌ణికి సారీ చెప్పాడు. ఈ మేర‌కు అత‌ను మ‌రో కామెంట్ చేయ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి దేవునికైనా దెబ్బే గురువు అంటే ఇదే కాబోలు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss