Sunday, June 20, 2021

Latest Posts

కరోనా వైరస్ కారణంగా టాలీవుడ్ లో మరో విషాదం

Producer Sridhar Reddy Passed Away

కరోనా వైరస్ కారణంగా టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ‘సోగ్గాడి కాపురం, ‘బాలరాజు బంగారు పెళ్ళాం’ చిత్రాల నిర్మాత సి. శ్రీధర్‌ రెడ్డి కన్ను మూశారు. కొన్ని రోజులుగా ఆయన కరోనాతో బాధపడుతున్నారు. అయితే పరిస్థితి చేయి దాటిపోవడంతో శనివారం రాత్రి ఆయన మరణించారనే విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నిర్మాత శ్రీధర్‌ రెడ్డి స్వస్థలం నెల్లూరు. సినిమా ఇండస్ట్రీపై ఉన్న మక్కువతో శోభన్‌బాబు, జయసుధ జంటగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సోగ్గాడి కాపురం’ నిర్మించారాయన. ఆ తర్వాత సుమన్, సౌందర్య కలిసి వై. నాగేశ్వరావు దర్శకత్వంలో నటించిన చిత్రం ‘బాలరాజు బంగారు పెళ్ళాం’ నిర్మించారు. శ్రీధర్‌ రెడ్డి మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss