Monday, July 26, 2021

Latest Posts

వ్యాక్సిన్ ఇస్తానంటూ సురేష్ బాబుని మోసం చేసిన వ్యక్తి

Producer Suresh Babu Got Cheated

ప్రొడక్షన్ హౌస్ ఉద్యోగులకు కోవిడ్ -19 టీకాలు వేస్తామని హామీ ఇచ్చి ప్రముఖ తెలుగు చిత్రనిర్మాత సురేష్ బాబు వద్ద లక్ష రూపాయిలు తీసుకొని మోసం చేశాడో వ్యక్తి. దీనితో నిర్మాత జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఆ వ్యక్తి పై ఫిర్యాదు చేశారు. అయితే టెలివిజన్ ఛానెల్‌ను మోసం చేసినందుకు ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు ఆ వ్యక్తి.

ఆ వ్యక్తి నిర్మాతకు ఫోన్ చేసి సురేష్ ప్రొడక్షన్స్ లో పనిచేసే 500 మందికి కోవిడ్ వ్యాక్సిన్లను ఏర్పాటు చేస్తానని ప్రతిపాదించాడు. తన భార్య బ్యాంకు ఖాతాకు లక్ష రూపాయలు బదిలీ చేయాలని నిందితుడు సురేష్ బాబును కోరాడు. తీరా డబ్బు వేశాక,ఆ వ్యక్తి అలియాస్ నాగార్జున రెడ్డి తన మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేశాడు. తనను మోసం చేశాడని తెలుసుకున్న తరువాత సురేష్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఉద్యోగులకు తక్కువ ధరలకు టీకాలు వేసే ముసుగులో టీవీ ఛానెల్‌ను మోసం చేశాడనే ఆరోపణతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు జూన్ 14న నాగార్జున రెడ్డిని అరెస్టు చేశారు. టీవీ ఛానెల్‌కు ఫోన్ చేసి తాను తెలంగాణ మంత్రి కె.టి. రామారావు అసిస్టంట్ అని చెప్పి సిబ్బందికి 100 రూపాయల చొప్పున కోవిడ్ -19 వ్యాక్సిన్లను వేయిస్తానని తెలిపాడు.

1,500 మంది ఉద్యోగులకు టీకా డ్రైవ్ కోసం ఛానల్ రూ .1.5 లక్షలు చెల్లించింది. అయితే, డబ్బు అందుకున్న తరువాత,నాగార్జున రెడ్డి కాల్స్‌కు స్పందించడం మానేశాడు. దీనితో ఛానల్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి అతనిని అరెస్టు చేశారు. కొద్ది రోజుల్లో అతన్ని రిమాండ్ కోసం కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss