Thursday, December 2, 2021

Latest Posts

గో బ్యాక్‌ నిర్మల సీతారామన్‌

Protest against Visakhapatnam steel plant

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ శనివారం విశాఖలో వామపక్ష, కార్మిక సంఘాల నిరసనలు తెలిపాయి. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ను వెంటనే ఆపలంటు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. నిర్మల సీతారామన్‌ దిష్టిబొమ్మను దగ్థం చేస్తూ కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ గో బ్యాక్‌ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేసారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి.గంగారావు, జగన్‌, నాయుడు కుమార్‌, రమణ, తదితరులు పాల్గొన్నారు. కేంద్రమంత్రి నిన్న సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్టు కు చేరుకున్న సందర్బంలో కార్మికులు స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ వద్దు అంటూ అక్కడ కూడా నిరసన చేపట్టారు.  ఆమెకు వినతిపత్రాన్ని ఇవ్వడానికి వెళ్లిన కార్మిక నేతలను పోలీసులు అడ్డుకొని అరెస్టులు చేశారు. ఆ అరెస్టులను సిపిఎం, విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాలు ముక్త ఖంటంతో  ఖండించాయి.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss