Sunday, June 20, 2021

Latest Posts

వైరలవుతున్న పవన్ కళ్యాణ్ కొత్త పోస్టర్ పై చిత్ర బృందం స్పష్టత

PSPK 28 First Look Poster Going Viral

నిన్నటి నుంచి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిత్రంలో, పవన్ గడ్డంతో బైక్ మీద కూర్చుని చాలా స్టైలిష్ గా కనిపించాడు. పవన్ అభిమానులు ఈ ఫోటోతో ఫిదా అయిపోయారు. అయితే ఈ ఫోటో పవన్ రాబోయే చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ అని అనుకున్నారు.

దీనితో ఈ ఫోటో పై స్పష్టత ఇచ్చారు చిత్ర బృందం. ఈ చిత్రం వైరల్ అయ్యి, #PSPK28ను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్‌ వారి దగ్గరకి చేరడంతో వారు ఇలా స్పందించారు. “మేము ఉగాది రోజు టైటిల్ & ఫస్ట్ లుక్ విడుదల చేయాలని ప్లాన్ చేసాము, కాని మహమ్మారి పరిస్థితి కారణంగా, మేము దానిని వాయిదా వేసాము! ఆల్రెడీ వాయిదా వేశాము అని తెలిసినా పోస్టర్ లు రావడం ఆశ్చర్యంగా ఉంది.  సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మా అధికారిక సోషల్ మీడియా అక్కౌంట్స్ నుండి అప్డేట్ ఇస్తాము అని తెలిపారు.”

దీనితో ఈ ఫోటో పవన్ అభిమానులు చేసిన ఎడిట్ అని తేలిపోయింది. కాకపోతే పవన్ అభిమానులు పవన్ లుక్ ని ఎలా కోరుకుంటున్నారో ఫోటో ద్వారా చెప్పినట్లు తెలుస్తుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించబోయే ఈ చిత్రాన్ని పవన్ త్వరలోనే ప్రారంభించబోతున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss