Sunday, June 13, 2021

Latest Posts

భారీ సిక్సర్లతో విరుచుకుపడుతున్న పూజారా

Pujara Hitting Sixes In CSK

ఏప్రిల్‌ 9 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్‌ 14వ సీజన్ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మన్‌, భారత్ స్టార్,చతేశ్వర్‌ పుజారా సన్నద్ధమవుతున్నాడు. తనపై టెస్ట్‌ క్రికెటర్‌గా ఉన్న ముద్రను తొలగించుకునేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నాడు. ఇందులో భాగంగా నెట్స్‌లో కఠోర సాధన చేస్తున్నాడు.

ఇప్పుడు ఈ ప్రాక్టీస్ వీడియో బయటకు వచ్చింది. ఈ ప్రాక్టీస్‌ సెషన్‌లో బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు పూజారా. ముఖ్యంగా స్పిన్‌ బౌలింగ్‌లో భారీ షాట్లతో విరుచుకుపడుతూ, పుజారా దుమ్ము లేపుతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే పూజారా ఇది వరకే ఐ‌పి‌ఎల్ ఆడినప్పటికీ అతనికి అంత గుర్తింపు రాలేదు. ఇప్పుడు అతను తన సత్తా చూపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. చివరగా 2014లో పూజారా ఐ‌పి‌ఎల్ ఆడాడు. పుజారా తన ఓవరాల్‌ ఐపీఎల్‌ కెరీర్‌లో మొత్తం 30 మ్యాచ్‌లు ఆడగా, 99.74 స్ట్రయిక్‌ రేట్‌తో 390 పరుగులు సాధించాడు.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss