Thursday, May 13, 2021

Latest Posts

ఆ ట్వీట్ తో సంబంధం లేదంటూ   పూనం మండిపాటు ………….

చేయని తప్పుకి కొందరు హీరోయిన్స్ బలవుతున్నారా ఇప్పుడు పూనమ్ కౌర్ కి ఎదురైనా పరిస్థితి చూస్తే అలానే అనిపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే,  ‘రెండు బెత్తం దెబ్బలు’ అంటూ పవన్ ఉద్దేశించి ట్వీట్ చేసి, ఆపై డిలీట్ చేసినట్టు వస్తున్న వార్తలపై నటి పూనం కౌర్ కొంచెం  ఘాటుగా స్పందించింది. కొన్ని మీడియా గ్రూపులు కావాలని, పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడింది. ఆ ట్వీట్ తాను చేయలేదని స్పష్టం చేసింది.

అసలు  వారంత సైకోల్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని పూనమ్  ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నికలు పూర్తయ్యాయని, అయినా తనకు, తన కుటుంబానికి చేయాల్సిన నష్టమంతా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా నన్ను, ఆ ‘వ్యక్తి’ని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి పిచ్చి రాతలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రచారం చేసి తామెంత దిగజారిపోయామో తమను తాము నిరూపించుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించింది.

వారంతా పరాజితులని పేర్కొన్న పూనం కౌర్ ‘సోల్డ్ మీడియా’(#soldmedia), ప్రెస్టిట్యూట్స్ (#presstitutes) హ్యాష్‌టాగ్‌లతో ట్వీట్ చేసింది. ఇలాంటి ‘ప్రెస్టిట్యూట్లు’, ‘పొలిటీషియన్ల’ కంటే బతుకుదెరువు కోసం ఒళ్లు అమ్ముకుని జీవించే వేశ్యలు చాలా నయమని పూనం పేర్కొంది. చేతకాని, అసమర్థులైన వీరు తమ చుట్టూ ఉన్నవారి కోసం ఏమీ చేయలేరని, అలాంటి వారు నాయకులు ఎలా అవుతారని ప్రశ్నించింది. ఇలాంటి విధ్వంసకర వైఖరి ప్రజలను కేన్సర్‌లా పట్టిందని ఆమె పేర్కొంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss