Sunday, June 20, 2021

Latest Posts

అల్లు అర్జున్ పుష్ప పై బ్రేకింగ్ న్యూస్

Pushpa Movie Latest News

అల్లు అర్జున్ మరియు సుకుమార్ కలిసి చేస్తున్న మూడవ చిత్రం పుష్ప ప్రస్తుతం నిర్మాణం దశలో ఉంది. చిత్ర యూనిట్ ఇప్పుడు ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయడానికి ఆలోచిస్తోంది. ఈ చిత్రం 20 ఆగస్టు 2021 న తెరపైకి రావాల్సి ఉంది, అయితే కరోనా మహమ్మారి వల్ల మేకర్స్ ఈ చిత్రం విడుదల వాయిదా పడే అవకాశం ఉంది.

అయితే సమయం ఎక్కువ ఉన్నందున దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని బాహుబలి మరియు కెజిఎఫ్ మాదిరిగానే రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నారట. స్క్రిప్ట్ ఇంకాస్త ఇంప్రూవ్ చేసి రెండు భాగాలుగా చేయడానికి నిర్మాతలను ఒప్పించినట్టు తెలుస్తుంది.

ఈ ఆలోచనను అల్లు అర్జున్‌తో కూడా చర్చించరాట సుకుమార్. ఈ కథకు భారీ వ్యవధి ఉన్నందున  స్క్రిప్ట్‌కు మరింత ఆసక్తికరమైన అంశాలను జోడిస్తున్నారట సుకుమార్. అయితే తుది నిర్ణయాన్ని సుకుమార్‌కు వదిలిపెట్టాడట అల్లు అర్జున్‌. ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరిగితే, పుష్ప రెండు పార్ట్ లుగా మారనుంది.

మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ పుష్పతో తెలుగులో అడుగుపెట్టనున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్ర సంగీత దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss