Tuesday, April 13, 2021

Latest Posts

మాస్ లుక్ లో ఇరగ దీసిన బన్నీ – పుష్ప టీజర్

Pushpa Teaser Released
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రేక్షకులు ఎంత గానో ఎదురు చూస్తున్న అల్లు అర్జున్‌ను పుష్ప టీజర్ విడుదల అయ్యింది. అల్లు అర్జున్ మొదటి సారి ఒక ఊర మాస్ పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్రకి బన్నీ ప్రాణం పోసినట్టుగా కనిపిస్తుంది. తన లుక్ నుండి వేషధారణ వరకు, అల్లు అర్జున్ అన్నీ ఈ పాత్ర కోసం మార్చుకున్నాడు. అల్లు అర్జున్ “తగ్గేదే లే” అని టీజర్‌లో చెప్పే డైలాగ్ టీజర్ కె హైలైట్ అని చెప్పాలి.

శేషాచలం అటవీ నేపథ్యంలో నిర్మించిన ఈ చిత్రం ఎర్ర గంధపు చెక్క స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడే విడుదల అయ్యిన పుష్ప టీజర్ యాక్షన్-ప్యాక్డ్ షాట్లతో నిండి ఉంది. అల్లు అర్జున్ మాస్ లుక్ కూడా అదిరిపోయింది. డి‌ఎస్‌పి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా టీజర్ పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ఈ సినిమాని సుకుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.

 

Watch Pushpa Teaser:

ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ పుష్ప ఆగస్టు 13న థియేటర్లలోకి రానుంది మరియు ఇది బహు భాషా చిత్రంగా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss