Monday, July 26, 2021

Latest Posts

పుష్ప విలన్ కి షూటింగ్ సమయంలో గాయాలు

Pushpa villain Fahadh Faasil Injured

మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప చిత్రంలో పనిచేస్తున్నారు. ఇది రెండు భాగాలుగా విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ పుష్ప పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతుంది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఇందులో విలన్ గా చేస్తున్న ఫహద్ ఫాసిల్ కి షూటింగ్ జరుగుతుండగా ప్రమాదం జరిగింది.

ప్రమాదం కారణంగా అతనికి ముక్కుపై మూడు కుట్లు పడినట్లు తెలుస్తుంది. అయితే తనకు జరిగిన ప్రమాదం పై ఈ నటుడు స్పందించాడు. సాధారణంగా ప్రమాదం జరిగినప్పుడు షాక్ లో తమ చేతులను నేల పై మోపడం మర్చిపోతారు. అయితే ఆ విషయాన్ని నేను మర్చిపోలేదు అందుకే నేను నా చేతులను నేల పై మోపడంతో 80 శాతం ప్రమాదం నుంచి బయటపడ్డాను అని చెప్పారు. నేను మరో సారి జీవితంతో అదృష్టవంతుడిని అని అన్నారు ఫాసిల్.

ఫహద్ ఫాసిల్ మలయాన్కుంజు కోసం కొన్ని స్టంట్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. కొంచెం హైట్ నుంచి దూకుతున్నప్పుడు పుష్ప విలన్ బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోయాడు. దీనితో నటుడు ఫహద్ ముఖానికి పలు గాయాలయ్యాయి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss