Tuesday, January 25, 2022

Latest Posts

మెడల్ కి ఒక్క అడుగు దూరంలో పి‌వి సింధు

PV Sindhu Entered Into Quarter Finals

టోక్యో ఒలింపిక్స్‌లో గురువారం మహిళల సింగిల్స్‌లో డెన్మార్క్‌కు చెందిన మియా మియా బ్లిచ్‌ఫెల్ట్‌ను ఓడించి భారతీయ షట్లర్ పివి సింధు మెడల్ కి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఈ విజయంతో ఆమె క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 41 నిమిషాల మ్యాచ్‌లో పివి సింధు 21-15, 21-13తో మియా బ్లిచ్‌ఫెల్ట్‌ను ఓడించింది. ఇక పివి సింధు జపాన్‌కు చెందిన అకానే యమగుచి, కొరియాకు చెందిన కిమ్ గేన్‌తో తలపడనుంది.

పివి సింధు 2016 రియో ​​ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు, టోక్యోలో బ్యాడ్మింటిన్ నుంచి సింధు మాత్రమే మిగిలింది. పురుషుల విభాగంలో మొదటి రౌండ్ లోనే సాయి ప్రణీత్ ఓడిపోవడంతో ఇప్పుడు ఆశలన్నీ ఆమె పైనే ఉన్నాయి.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss