Thursday, December 2, 2021

Latest Posts

చరిత్ర సృష్టించిన పివి సింధు

PV Sindhu first Indian woman athlete

టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మహిళల సింగిల్స్‌లో భాగంగా కాంస్య పతకం గెలుచుకున్నారు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో చైనాకి చెందిన హి బింగ్జియావోతో తలపడిన పీవీ సింధు 21-13, 21-15 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. ఈ సీజన్లో స్వర్ణం చేజార్చుకున్న సింధు ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మళ్లీ ఫామ్‌లోకి వచ్చి విజయం సాధించి, కాంస్య పతాకం కైవసం చేసుకుంది. దీంతో  రెండు ఒలంపిక్స్ మెడల్స్ గెల్చుకున్న తొలి మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది సింధు. టోక్యో ఒలింపిక్స్ భారత మహిళా అథ్లెట్ల దూకుడు కొనసాగుతోంది. ఇప్పటికే మీరా భాయ్ చాను, లవ్లీనా భారత్ కు పతకాలు ఖాయం చేయగా ఆ లిస్ట్ లో తెలుగు తేజం పీవీ సింధు కూడా చేరింది.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss