Saturday, May 15, 2021

Latest Posts

పీవీ సింధు ఫైర్

అవాస్తవ ప్రచారాలపై బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫైర్ అయ్యారు. ఇలాంటివి ప్రచారం చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. పీవీ సింధు తల్లిదండ్రులతో గొడవపడి వెళ్లిపోయిందని మీడియాలో ఇటీవల వార్తలు వచ్చాయి. టోక్యోలో జరిగే ఒలింపిక్స్ కోసం జాతీయ క్యాంపులో శిక్షణ తీసుకుంటున్న సింధు పేరెంట్స్ లేకుండా తొలిసారి ఆమె విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. తన కుటుంబంలో వచ్చిన కలహాల వల్ల సింధు లండన్‌కు వెళ్లిపోయిందని ఓ మీడియా సంస్థ తెలిపింది. ఈ కథనాలలో ఎటువంటి నిజం లేదని సింధు తేల్చేసింది.లాక్‌డౌన్ వేళ ఇంట్లోనే ఉన్న సింధు తమ పేరెంట్స్ వల్ల వత్తిడికి గురైందని. టోక్యో ఒలింపిక్స్ కోసం నేషనల్ క్యాంపులో శిక్షణ తీసుకుంటున్న సింధు సడన్‌గా లండన్‌కు వెళ్లిపోయిందని ఓ స్పోర్ట్స్ జర్నలిస్టు కథనాలను రాసుకొచ్చారు. ఈ కథనాలలో ఎటువంటి నిజం లేదని తేల్చేసింది సింధు. కుటుంబంలో సమస్యలు తలెత్తడం వల్లే ఆమె పది రోజుల క్రితం లండన్ వెళ్లిందని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ టీమ్ తో కలిసి ఆమె అక్కడే ప్రాక్టీసును మొదలు పెట్టనుందని, ఆమెను తిరిగి ఇంటికి రప్పించడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని ఆ కథనంలో పేర్కొన్నాడు.

ఫిట్‌నెస్‌లో భాగంగా న్యూట్రిషన్ కోసం తాను కొన్ని రోజుల క్రితం లండన్‌కు వచ్చానని, నిజానికి తన తల్లిదండ్రుల అనుమతితోనే వచ్చానని ఆమె చెప్పింది. ఈ విషయంలో వారితో ఎటువంటి గొడవలూ లేవని వివరించింది.నాకోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన తల్లిదండ్రులతో నాకు సమస్యలు, గొడవలు ఎందుకు ఉంటాయి? నా కుటుంబంతో నేను చాలా క్లోజ్ గా ఉంటాను. వారు నన్ను ఎల్లప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ప్రతిరోజు నేను వారితో మాట్లాడుతూనే ఉన్నాను అని సింధు తెలిపింది. నాకు నా కోచ్ పుల్లెల గోపిచంద్ తోనూ, ఆయన శిక్షణ సంస్థతోనూ ఎటువంటి సమస్యలు లేవు. టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ రిపోర్టర్ నాపై అసత్య ప్రచారం చేస్తున్నాడు. ఇటువంటి వార్తలు రాసేటప్పుడు నిజాలు ఏంటో తెలుసుకుని రాయాలి. అతడు ఇటువంటి చర్యలను మానుకోకపోతే నేను అతడిపై చట్టబద్ధంగా పోరాడతాను అని పీవీ సింధు హెచ్చరించింది. తనకు తన పేరెంట్స్‌తో కానీ, కోచ్ గోపితో కానీ ఎటువంటి విబేధాలు లేవని సింధు చెప్పింది. నా కోసం పేరెంట్స్ ఎంతో త్యాగం చేశారని, వారితో నాకెందుకు సమస్యలు వస్తాయని ఆమె తన ట్వీట్‌లో ప్రశ్నించింది.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss