Thursday, December 2, 2021

Latest Posts

దుర్గమ్మను దర్శించుకున్న పివి సింధు

PV Sindhu Visits Kanaka Durga Temple

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పివి సింధు ఈ రోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేదాశీర్వచనాన్నిచ్చారు. అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని ఆలయ ఈఓ భ్రమరాంబ సింధుకు అందజేసారు. అనంతరం పివి సింధు మీడియాతో మాట్లాడుతూ టోక్యో ఒలింపిక్స్‌ క్రీడల్లో కాంస్య పతకాన్ని సాధించడం చాల ఆనందంగా ఉందని, టోర్నమెంట్‌కు వెళ్లేముందు అమ్మవారి దర్శనానికి వచ్చానని, కాంస్య పతకాన్ని సాధించి తిరిగి అమ్మవారి దర్శనానికి రావడం చాలా సంతోషంగా ఉందని, 2024లో కూడా ఒలింపిక్స్‌లో ఆడతానని, అప్పడు కచ్చితంగా స్వర్ణం సాధిస్తానని ఈ సందర్బంగా సింధు ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss