quarantine meals in quarantine centres
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా రోజు రోజుకు విజ్రంబిస్తుంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరగటంతో అందరిలోనూ భయాందోళనలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 348 మందికి ఈ వ్యాధి సోకింది వారిలో ఎక్కువ నిజముదిన్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే. ఇప్పటి వరకు 9 మందికి తగ్గడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. కానీ ఈ మహమ్మారి వల్ల నలుగురు చనిపోయారు.
అలాగే క్వారంటైన్లో ఉన్నవారికి ఎలాంటి ఆహారం అందిస్తున్నారో అనే విషయంపై ప్రభుత్వం ఓ క్లారిటీ ఇచ్చింది. ఆరోగ్య ఆంధ్ర ఫుడ్ ట్విట్టర్ ద్వారా అధికారులు క్వారంటైన్ లో ఉన్న వారికి అందించే ఆహారానికి సంబంధించిన ఫోటో విడుదల చేసింది. క్వారంటైన్లో ఉన్నవారికి ఇమ్యునిటీ పవర్ పెంచేందుకు బలమైన ఫుడ్ అందిస్తున్నామంటు నూజివీడు డివిజన్ నుండి మరియు పెనమలూరు, విజయవాడ డివిజన్ అదికారులు పోస్టులు, ఫోటతో సహ పెట్టారు. ఆ ఫోటోను బట్టి క్వారంటైన్లో ఉన్నవారికి గుడ్లు, పండ్లు, బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం, ఓ జ్యూస్ అందజేస్తునట్లు తెలుస్తుంది.