Sunday, June 20, 2021

Latest Posts

సల్మాన్ ఖాన్ రాధే సినిమా అదిరిపోయే కలెక్షన్స్

Radhe Movie OTT Collection
సినిమా ప్రేక్షకులను అలరించడానికి గురువారం సల్మాన్ ఖాన్ సినిమా ‘రాధె’ను జీప్లెక్స్, జీ5 ఓటీటీలతో పాటు రెండు డీటీహెచ్‌ల ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. అయితే సినిమా థియేటర్ కి అవకాశం ఉన్న చోట్ల, ఓవర్సీస్ లో ఈ సినిమాని థియేటర్స్ లో విడుదల చేశారు.

అయితే సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పై ప్రతికూల ప్రభావం పడుతుందని అందరూ అంచనా వేశారు. అయితే తొలి రోజే ‘రాధె’ ఓవర్సీస్ నుంచి రూ.5 కోట్ల వసూళ్లు రాబట్టి మంచి స్పీడ్ లో దూసుకుపోతుంది.

ఇక ఇండియాలో ఈ సినిమా తొలి రోజు ఎంత డబ్బులు వసూలు చేసిందనేది చూస్తే షాక్ అవ్వక తప్పదు. జీ ఓటీటీల్లో ‘రాధె’ సినిమాను తొలి రోజు మొత్తంగా 42 లక్షల మంది వీక్షించారని సమాచారం. అదే నిజమైతే.. ఈ సినిమా తొలి రోజు ఓటిటిలో 104 కోట్లను సంపాదించింది. ఎందుకంటే ఈ చిత్రానికి ఓటీటీలో నిర్ణయించిన టికెట్ రేటు రూ.249. 42 లక్షల మంది 249 రూపాయలు వెచ్చించారంటే వసూళ్లు 104 కోట్లకు పై చిలుకు ఉంటుందని అంచనా.

అయితే మొత్తం వారంతానికి సినిమా ఎన్ని కోట్లు కొల్లగొడుతనేది వేచి చూడాలి. అయితే ఈ 42 లక్షల మందిలో చాలా మంది జీ సబ్‌స్క్రిప్షన్ 499 ద్వారా ఈ సినిమా కొనుక్కొని చూసినట్టు అంచనా. రాధెతో కలిసి కాంబో ఆఫర్ రూపంలో వార్షిక సబ్‌స్క్రిప్షన్ వల్ల జీ కి భారీ సబ్‌స్క్రిప్షన్ ఆదాయం వచ్చిందని తెలుస్తుంది. అంతే కాదు సల్మాన్ ఖాన్ దెబ్బ కి నిన్న జీ ఓటిటీ క్రాష్ కూడా అయ్యింది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss