Friday, March 5, 2021

Latest Posts

రాధే శ్యామ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Radhe Shyam Movie Release Date Fixed

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటిస్తున్న రాధే శ్యామ్ చిత్రం షూటింగ్ శర వేగంగా పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతున్నది. సాహో తర్వాత ప్రభాస్ సినిమా కోసం ఎదురు చూస్తున్న సినీ ప్రేక్షకులకు నిర్మాతలు శుభవార్తను చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, ప్రసీదా ఉప్పలపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే జనవరిలో ట్రైలర్‌ను రిలీజ్ చేయడానికి సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ప్రభాస్ అభిమానులను హుషారెత్తించేందుకు కొద్ది రోజుల్లో నిర్మాతలు అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్‌ను ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారంటే.. 2021 మార్చి 30వ తేదీన రిలీజ్ చేయడానికి యువీ క్రియేషన్స్ ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఇకపోతే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న రాధేశ్యామ్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

  • ముద్దోస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కొడుకుల ఫోటోలు చూశారా

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss