Monday, July 26, 2021

Latest Posts

రాధే శ్యామ్ సెట్స్ కోసం ఫ్యాన్సీగా ఖర్చు పెట్టారే

Radhe Shyam Movie Sets

ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ ఇప్పుడు ప్రజల దృష్టిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చాలా కాలం తర్వాత ప్రభాస్ లవర్ బాయ్ గా కనిపించనున్నారు. రాధే శ్యామ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది మరియు మేకర్స్ సెట్స్ కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారు.

ఈ చిత్రంలో సెట్స్ నిర్మాణం కోసం మాత్రమే వంద కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారట. ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ లో 26 సెట్ల కోసం రూ.106 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. అంటే ఈ సినిమాలో ఏ రేంజ్ లో లొకేషన్స్ ఉంటాయో ఆలోచించాల్సిందే. ఇటీవలే ఈ సినిమాలో వి‌ఎఫ్‌ఎక్స్ అద్భుతంగా ఉంటాయని చిత్ర నిర్మాతలు చెప్పారు. కొన్ని హర్రర్ సీన్స్ ఉంటాయని వాటిలో వచ్చే గ్రాఫిక్స్ ఎప్పుడు చూడని విధంగా ఉంటాయని చెప్పింది చిత్ర బృందం.

ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. రాధే శ్యామ్‌ను యువి క్రియేషన్స్,గోపికృష్ణ పిక్చర్స్, టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విడుదల తేదీని త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss