Monday, July 26, 2021

Latest Posts

రాధే శ్యామ్ లో మైమరిపించేలా ఈ సీన్స్ ఉంటాయట

Radhe Shyam Movie To Have Horror Scenes

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంతో మళ్ళీ తిరిగి రొమాంటిక్ సినిమాలో కనిపించబోతున్నాడు. దీనిలో అతను పూజా హెగ్డేతో రొమాన్స్ చేయబోతున్నాడు. రాధే శ్యామ్ యొక్క ప్రధాన భాగం షూట్ పూర్తయ్యింది. అలానే మేకర్స్ మిగిలిన షూట్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు.

రాధే శ్యామ్ 1920ల కాలంలో ఇటాలియన్ నేపథ్యాన్ని కలిగి ఉన్న ఒక పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్. తాజాగా ఈ సినిమాలో హర్రర్ సీన్స్ ఉంటాయని చిత్ర బృందం లీక్ చేసింది. హర్రర్ సన్నివేశాల్లో కనిపించే వీఎఫ్‌ఎక్స్, గ్రాఫిక్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్లేలా చేస్తుందని సమాచారం. మీరు ఎప్పుడు చూడని విధంగా ఈ హర్రర్ సన్నివేశాలు ఉంటాయని అంతర్గత వర్గాల టాక్.

ఇక ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ పాటలు కంపోజ్ చేస్తుండగా ఈ సినిమాను జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss