Tuesday, January 25, 2022

Latest Posts

రాధే శ్యామ్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

Radhe Shyam Release Date Confirmed

‘రాధే శ్యామ్’ అభిమానులకు ఒక శుభవార్త వచ్చింది. అదే ఈ సినిమా యొక్క కొత్త విడుదల తేదీ. ఈ విషయాన్ని స్వయంగా హీరో ప్రభాస్ తన సోషల్ మీడియా అక్కౌంట్ లో తెలియజేశారు. ప్రభాస్ ఈ సినిమా 2022 జనవరి 14వ తేదీన విడుదల కానుందని చెపుతూ ఈ రోజు కోసం వేచి ఉండలేను అని తెలిపారు.

దీనితో ‘రాధే శ్యామ్’  విడుదలకి మరో ఐదు నెలలు గ్యాప్ ఉంది. దీనితో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మొదటగా ఈ చిత్రం జూలై 30వ తేదీ ప్రేక్షకుల ముందుకి రావాలి కానీ లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షెడ్యూల్ వాయిదా పడుతూ వచ్చింది. ఇంకా ఈ సినిమా చిత్రీకరణ పది రోజులు మాత్రమే మిగిలి ఉందని పూజ హెగ్డే చెప్పారు. అయితే ఈ సినిమా గ్రాఫిక్స్ ఎప్పుడూ చూడని విధంగా ఉంటాయని అందుకే విడుదల తేదీ అంత ఆలస్యమవుతుందని చిత్రనిర్మాతలు చెబుతున్నారు.

ఇక ‘రాధే శ్యామ్’ సినిమా ఒక టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్, మరియు ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్. ఒకేసారి ఐదు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss