Tuesday, April 13, 2021

Latest Posts

పళ్లతో కొట్టే రాఘవేంద్రరావు ఆ పండు జోలికే వెళ్ళలేదు

Raghavendra Rao hitting the fruit did not go smoothly

భామలను అందంగా ఎలా చూపించాలో బాగా తీసిన దర్శక దిగ్గజం దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు.  టాలీవుడ్‌ సినిమాల్లో ఈయన  సాంగ్స్ కి  ఓ స్పెషాల్టీ ఉంటుంది. ముఖ్యంగా   హీరోయిన్ ను తెరపై ఏ ఏ యాంగిల్స్ లో  ఎంత అందంగా ఆవిష్కరించాలో ఈయనకు తెలిసినంతగా ఇంకెవరికీ రాదేమో.దర్శకేంద్రుడి కెమెరాకు ప్రతి భామ ఒక ముద్దబంతి పువ్వులా చిక్కుతుంది.  పదహారేళ్ల వయసు కన్నెపిల్ల భావాలను సిరిమల్లె పువ్వులా చూపించినా, కథానాయికను శృంగారదేవతగా దర్శింప జేసినా అది  ఆయనకే చెల్లిందని చెప్పాలి.

రాఘవేంద్రరావు  రూపొందించే సినిమాల్లో  కథ, కథనంతో పాటు మ్యూజిక్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ,పాటల చిత్రీకరణలో తనదైన మార్క్ చూపిస్తారు.   హీరోయిన్ ను గ్లామర్ గా చూపించడంలో దర్శకేంద్రుడి ప్రతిభ మామూలు రేంజ్ లో ఉండదు.  అందుకనే ఆయన మూవీని కేవలం పాటల కోసం మాత్రమే చూసే ప్రేక్షకులు నేటికి ఉన్నారు.  ముఖ్యంగా హీరోయిన్స్ నాభిపై వేసే పూలు, పండ్ల కోసం రిపీట్ ఆడియన్స్ ఉంటారట. ఇక ఆయన తెరకెక్కించిన సినిమాల్లో జయప్రద, జయసుధలపై మాత్రమే ఆయన ఎలాంటి పండ్లను వేయలేకపోయారు.

ఆయన దర్శకత్వంలో నటించిన  ఏ హీరోయిన్ కూడా  ఆయన పండ్ల దెబ్బల నుంచి తప్పించుకోలేకపో యింది. ఇక  పండు మీద కూడా ఓ పాట కూడా ఉంది.  ఆయన తీసే సినిమాల్లో సన్నివేశాలు పాటలు ప్రేక్షకుల మదిలో అలా గుర్తుండిపోయాయి. అయితే  ఇప్పటి వరకు రాఘవేంద్రరావు వాడని పండు ఏమిటి తెలిస్తే ఆశ్చర్యపోతారు. రాఘవేంద్ర రావు ఇప్పటి వరకు వెళ్లిన ప్రతి ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ ఫేస్ చేసేవారు.  ఇప్పటి వరకు హీరోయిన్స్ పై వాడని పండు ఏదైనా ఉందా అంటే, అది  పనస పండు అని చెప్పక తప్పదు. ఆయన ఏ సినిమాల్లో ఈ పండును హీరోయిన్స్‌పై వేయలేదు.  అదండీ అసలు సంగతి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss