Tuesday, January 25, 2022

Latest Posts

ట్రాక్టర్‌ పై పార్లమెంట్‌కు వెళ్ళిన రాహుల్‌

Rahul Gandhi Drives tractor to Parliament

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు ట్రాక్టర్‌పై వచ్చి హాజరయ్యారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాహుల్‌ నేడు స్వయంగా ట్రాక్టర్‌ నడుపుతూ పార్లమెంట్‌కు చేరుకొని తన నిరసనను తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో గత కొన్ని నెలలుగా రైతులు సాగిస్తున్న ఉద్యమంకు మద్దతుగా రాహుల్‌ ఈ విధంగా వారి నిరసనను తెలుపుతూ వెంటనే కొత్త సాగు చట్టాలను రద్దు చెయ్యాలని డిమాడ్‌ చేశారు.

కాగా రైతుల సందేశాన్ని నేను నేడు పార్లమెంట్‌కు విన్నవిస్తానని కానీ ఈ ప్రభుత్వం నా గళాన్ని అణచివేస్తోందని మండిపడ్డారు. నూతన వ్యవసాయ చట్టాలపై పార్లమెంట్‌లో చర్చకు కూడా అనుమతినివ్వట్లేదని ఈ సందర్బంగా తెలిపారు. కేంద్రం తెసుకోచ్చిన ఈ నూతన సాగు చట్టాలు కేవలం ఇద్దరు ముగ్గురు వ్యాపారవేత్తల కోసం మాత్రమే అని దేశమంతా తెలుసు అని తెలిపారు. రైతులకు ఉపయోగం లేని ఈ చట్టాలను కేంద్రం వెంటనే ఉపసంహరించాలి” అని రాహుల్ ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss