Thursday, December 2, 2021

Latest Posts

ప్రతిపక్ష ఎంపీలతో సైకిల్ తొక్కిన రాహుల్ గాంధీ

Rahul Gandhi leads bicycle rally

బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాలని విపక్షాలకు అల్పాహార విందు సమావేశానికి ఆహ్వానించారు రాహుల్ గాంధీ. ఈరోజు జరిగిన అల్పాహార విందు అనంతరం దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు పార్లమెంటుకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. రాహుల్ గాంధీ  పిలుపు మేరకు అల్పాహార విందు సమావేశానికి ఆప్, బీఎస్పీ లు మినహా టీఎంసీ, ఎన్సీపీ, శివసేన,ఆర్జేడీలతో సహా మొత్తం 18 పార్టీలకు చెందిన ఉభయసభలకు చెందిన నేతలు హాజరయ్యారు. సమావేశంలో విపక్షాలన్నీ ఐకమత్యంగా ఉండాలని బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ.

కాగా “పెగసస్” సాఫ్టువేర్‌ను మోడి ప్రభుత్వం కొనుగోలు చేసిందా? అని ఈ సందర్బంగా రాహుల్ ప్రశ్నించారు. అలాగే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందని, ఏమాత్రం కట్టడి లేకుండా నిత్యం పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాహనాలపై బయటకు వెళ్లాలంటేనే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని అన్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత తరువాత రాహుల్ గాంధీతో పాటు ఎంపీలంతా సైకిల్ తొక్కుకుంటూ పెట్రోల్ ,డీజిల్ ధరలను కంట్రోల్ చేయలేని కేంద్రం తీరుపై నిరసన తెలియజేస్తూ పార్లమెంట్ కు వెళ్లారు. ఈ సైకిల్ ర్యాలీలో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss