Thursday, December 2, 2021

Latest Posts

న్యాయం జరిగే వరకూ వారి తరఫున పోరాడతా – రాహుల్ గాంధీ

Rahul Gandhi meets family of minor girl raped killed in Delhi

దేశ రాజధానిలో ఆదివారం 9 ఏళ్ల చిన్నారి పై అత్యాచారం, హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ చిన్నారి  కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ రోజు పరామర్శించి న్యాయం జరిగే వరకూ వారి తరఫున తానూ పోరాడతా అని వారికీ మాట ఇచ్చారు. చిన్నారి కుటుంబసభ్యులతో కాసేపు గడిపిన రాహుల్ వారికీ ధైర్యం చెప్పి, న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటానని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ ఆ కుటుంబంతో నేను మాట్లాడాను వారు కోరుకునేది ఒక్కటే తమ బిడ్డకు న్యాయం జరగాలని. వారికి మేం అండగా ఉండి న్యాయం జరిగే వరకూ వారి తరఫున పోరాడతాం. చిన్నారి కేవలం ఆ కుటుంబానికి మాత్రమే ఆడబిడ్డ కాదని, ఈ దేశానికి చెందిన ఆడబిడ్డ అని రాహుల్ అన్నారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss