Rahul Gandhi tweet On Coronavirus Crisis:
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నేపథ్యంలో జనతా కర్ఫ్యూ నిర్వహిద్దామంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం నాడు దేశవ్యాప్తంగా సంపూర్ణ మద్దతు లభించింది. ఆ సందర్భంగా సాయంత్రం 5 గంటలకు ఇళ్ల నుంచి బయటకు వచ్చి అందరూ చప్పట్లు చరచాలని కూడా మోదీ చేసిన విజ్ఝప్తికి దేశం మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ మంగళవారం ఓ ట్వీట్ చేశారు.
‘‘దేశంలో కరోనా వైరస్ వ్యాపించకుండా నియంత్రించడంలో విఫలమైన మోడీ ప్రభుత్వం.. ప్రజలను చప్పట్లు కొట్టాలంటూ పురిగొల్పడం ఏమిటి?’’ అంటూ రాహుల్ గాంధీ తన ట్వీట్ లో విమర్శించారు. వేగంగానే ఈ ట్వీట్ వైరల్ అయింది. ఇక చూసుకోండి .. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా రాహుల్ పై సెటైర్లతో పాటు ట్రోలింగ్ మొదలైపోయాయి. పెద్ద సంఖ్యలో నెటిజన్లు రాహుల్ ట్వీట్ ను రీట్వీట్ చేయడంతో పాటు సదరు ట్వీట్ లో రాహుల్ అంశాన్ని ప్రస్తావిస్తూ… రాహుల్ అజ్ఝానాన్ని ప్రశ్నించేలా సంచలన కామెంట్లు చేయడం మొదలెట్టేశారు.
ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేలా దేశాన్ని రెడీ చేయలేకపోవడం వెనుక యాభై ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ నేతల పాత్ర ఏమీ లేదా రాహుల్ జీ అంటూ ఓ నెటిజన్ ప్రశ్నిస్తే, చప్పట్ల వెనుక ఉద్దేశం ఎపిడమిక్ పీరియడ్ లో తమ పాత్రని బాధ్యతతో నిర్వహిస్తున్న సిబ్బందికి అభినందలు తెలపడమని, అది క్కూడా అర్థం చేసుకోలేరా అని మరో నెటిజన్ ప్రశ్నించారు. కొందరైతే తమరు ఇటలీకి వెళ్లిపోండి రాహుల్ జీ అని మరింత సంచలన కామెంట్లు చేశారు. అంతేకాకుండా సంక్షోభ సమయంలో సహకరించకపోయినా సరే కానీ విమర్శలు చేయొద్దని రాహుల్ కు హితవు చెప్పారు. మొత్తంగా సింగిల్ ట్వీట్ తో రాహుల్ ఘోరంగా ట్రోల్స్ కి గురయ్యారు.