Monday, April 19, 2021

Latest Posts

జూన్‌ 1 నుండి పట్టాలెక్కనున్న రైళ్ళు

దేశవ్యాప్తంగా గత కొన్నిరోజులుగా లాక్‌డౌన్‌ కారణంగా రద్దు అయిన సాధారణ రైళ్లు పునఃప్రారంభం కానున్నాయి. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ఇప్పటికే రాష్ట్రాల్లో బస్సులు నడుపుతున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం రైళ్లు నడిపేందుకు కూడా సిద్దమవుతోంది.  ప్రస్తుతం వలస కార్మికుల కోసం శ్రామిక‌ రైళ్లు, స్పెషల్ ట్రైన్స్‌ మాత్రమే తిరుగుతుండగా జూన్‌ 1వ తేదీ నుంచి సమయానుకూలంగా రోజుకు 200 రైళ్లను నడపనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

దీనికి సంబంధించి ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని, త్వరలోనే రైళ్లకు సంబంధించిన సమయ పట్టికను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.  దేశంలోని ప్రతి ఒక్కరికి ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ కూడా తెలిపింది. కాగా కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైళ్లు ప్రయాణాలకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో ఆ మధ్యన రైళ్లను నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో మళ్ళీ కనిపించిన చిరుత

అయితే రైళ్లను నడపడం వలన కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉన్నందున జూన్ 30 వరకు ప్రయాణికులు బుక్‌ చేసిన టికెట్లను రద్దు చేస్తున్నట్లు, బుక్‌ చేసిన టికెట్ల డబ్బులు మొత్తాన్ని ప్రయాణికులకు తిరిగి చెల్లిస్తామని రైల్వే శాఖ ఇదివరకే ప్రకటించింది.

ఇది కూడా చదవండి: షర్ట్ లేకుండా స్విమ్మింగ్ ఫూల్‌లో మహేష్

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss