Tuesday, January 25, 2022

Latest Posts

ఏపి కి మరోక అల్ప పీడనం

Rain forecast for coastal Andhra Pradesh

ఏపీకి మరో అల్పపీడనం ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మొన్న తెలుగు రాష్ట్రాలలో మూడు రోజులు ఆగకుండా కురిసిన వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదులలో ఇంకా వరద కొనసాగుతుంది. వాటినుండి తేరుకోకుండానే ఆంధ్ర ప్రదేశ్ పై మరో అల్పపీడనం ప్రభావం ఉందని  వాతావరణ శాఖ వారు తెలిపారు.

ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడవచ్చని, అది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు పయనిస్తుంది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ  అల్పపీడనం ప్రబావం వల్ల ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss