Monday, July 26, 2021

Latest Posts

అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి 25 లక్షలు లంచం ఇచ్చిన రాజ్ కుంద్రా

Raj Kundra Bribed 25 Lakhs To ACB Officer

అశ్లీల చిత్రాల కేసులో, వ్యాపారవేత్త మరియు హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు రాజ్ కుంద్రా పోలీసు అధికారులకు 25 లక్షల రూపాయల లంచం ఇచ్చాడని తెలిసింది.

మార్చిలో రాకెట్ కింగ్‌పిన్‌గా పేరుపొందిన యష్ ఠాకూర్ ఈ విషయాన్ని ఒక పత్రికకు మెయిల్ ద్వారా వెల్లడించాడు. క్రైమ్ బ్రాంచ్ అధికారులకు 25 లక్షల లంచం ఇచ్చి ఇన్ని రోజులు అరెస్టు నుంచి తప్పించుకున్నాడని అతను ఆరోపించాడు. ఏప్రిల్‌లోనే, ఠాకూర్ ఈ ఫిర్యాదును ఎసిబి ముంబై పోలీస్ చీఫ్ కార్యాలయానికి పంపాడని సమాచారం. అయితే ఈ విషయం పై వ్యాఖ్యానించడానికి అధికారులు నిరాకరించారు.

ఇకపోతే రాజ్ కుంద్రా పై ఫిబ్రవరి లోనే ఈ కేసు నమోదయ్యింది. అయితే పోలీసులు పూర్తి ఆధారాలు దొరికే వరకు మాత్రం అతన్ని అదుపులోకి తీసుకోకపోవడం విశేషం.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss