ఉయ్యాల జంపాల మూవీ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజ్ తరుణ్ ఫిల్మ్ ఇండస్ట్రి లో అడుగుపెట్టకముందు ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ లో ఆక్ట్ చేశాడు. వాటిలో చాలా షార్ట్ ఫిల్మ్స్ కు యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. వాటిలో “లవ్లీ హవర్” “ద బ్లైండ్ డేట్” చెప్పుకోదగ్గవి. కాగా నాగార్జున ప్రొడ్యూస్ చేసిన “ఉయ్యాల జంపాల” మూవీ తో సిల్వర్ స్క్రీన్ పై తల్కుక్కున మెరిసాడు రాజ్ తరుణ్.
ఆ తర్వాతా వరుస సినిమాలతో బిజీ అయిన రాజ్ తరుణ్ సినిమా చూపిస్తా మామతో తనదైన యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులను ఫిడా చేశాడు. ఆ తరువాత తీసిన కుమారి 21 ఎఫ్ భారీ హిట్ కొట్టాడు. ఈ సినిమాను సుకుమార్ ప్రొడ్యూస్ చేయగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రాఫి చేశారు. ఈ సినిమాతో రాజ్ తరుణ్ కెరీర్ దూసుకుపోయింది. కాగా మజ్ను, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ లో కెమియో క్యారెక్టర్ లు కూడా వేశాడు. అలా మొదలయిన రాజ్ తరుణ్ కెరీర్ ప్రస్తుతం చేతిలో కొన్ని సినిమాలతో అలాగే అద్బుతంగా కొనసాగుతుంది.