Tuesday, January 19, 2021

Latest Posts

భారత దేశ తొలి మూకీ సినిమా “రాజా హరిశ్చంద్ర” కి 107 యేళ్ళు..!!

Raja Harishchandra is India’s first silent movie

రాజా హరిశ్చంద్ర… భారతదేశ సినీ చరిత్రలో మొదటి హిందీ మూకీ చలనచిత్రం గా  1913 May, 3 న ప్రదర్శించబడింది. దీనికి దర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే. ఈయన  రాజా రవివర్మ చిత్రాలచే ప్రభావితుడై ఈ సినిమాని నిర్మిచటం జరిగింది. ఇక ఒకసారి ఈ సినిమా విషయ విశేషాలను చూస్తే… 

ఈ సినిమా లో  ప్రదానంగా రామాయణ మహాభారతాల్లో పేర్కొనబడిన రాజు హరిశ్చంద్రుడి గూర్చి చూపించటం జరిగింది.  తన రాజ్యం, తన కుటుంబం పోగొట్టుకొని, విశ్వామిత్రుడికిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి, హరిశ్చంద్రుడు పడే తపన, యాతన వర్ణించే దే ఈ చిత్రం. ఇందులో పనిచేసినవాళ్ళంతా పురుషులే కావటం మరో విశేషం. స్త్రీపాత్రలకు కూడా పురుషులే పోషించారు. ఆ కాలంలో సినిమాలంటే చాలా తక్కువగా, ఏహ్యంగా చూసేవారు. అందులోనూ నటీనటులను ఇంకా ఈసడించుకునే కాలం అది. స్త్రీలెవరూ ఈ సినిమాలో పని చేయడానికి రాకపోవటం తో ఆ పాత్రలను పురుషులే పోషించటం జరిగింది.  ఈ సినిమా దాదాపు 40 నిముషాలపాటు ప్రదర్శించబడింది. ఇక 2008 లో, ‘హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ’ అనే సినిమా, రాజా హరిశ్చంద్ర సినిమా నిర్మాణానికి మూలం గా చేసుకుని నిర్మింపబడినది. ఆ రోజుల్లో  సినిమాలంటేనే ఒక జాడ్యంలా చూసేవారు. “సినిమాలో నటుస్తున్నారని చెప్పకండి, హరిశ్చంద్ర ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారని చెప్పండి” అని ఫాల్కే తన నటవర్గానికి నచ్చజెప్పటం జరిగింది.  1913 May, 3 న విడుదలైన ఈ సినిమా మంచి ప్రజాదరణ  పొందటం తో ఫాల్కే చరిత్ర సృష్టించాడు. ఆ పై  నిర్మాతగా దర్శకుడిగా స్థిరపడి, భారతీయ సినిమాలకు ఆద్యుడుగానూ నిలిచాడు.  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss