Wednesday, January 19, 2022

Latest Posts

ఆర్‌ఆర్‌ఆర్ రోర్ రెస్పాన్స్ పై స్పందించిన రాజమౌళి

Rajamouli Reacts On RRR Roar Response

‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’ అనే మేకింగ్ వీడియోతో టాలీవుడ్ అట్రాక్షన్ మొత్తం తన వైపు తిప్పేసుకున్నాడు రాజమౌళి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడుతున్నారు. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు మేకింగ్ వీడియో హాట్ టాపిక్ గా మారింది.

రాజమౌళి గొప్ప దర్శకుడు మాత్రమే కాదు, మార్కెటింగ్‌లో కూడా సిద్ధ హస్తుడు. కేవలం ఒక్క వీడియోతో ఆర్‌ఆర్‌ఆర్ దేశంలోని అందరి దృష్టిని ఆకర్షించేలా చేశాడు. మేకింగ్ వీడియోకు అద్భుతమైన రావడంతో దర్శకుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఇది తనకు ట్రైలర్ లాంచ్ లాగా అనిపిస్తుందని దర్శకుడు పేర్కొన్నారు.

తన ట్విట్టర్ ద్వారా దర్శకుడు మేకింగ్ వీడియో రెస్పాన్స్ పై తన స్పందనను పంచుకున్నారు. మేకింగ్ వీడియో కోసం ఈ అద్భుతమైన అవుట్‌పుట్‌ను బయటకు తీయడానికి చాలా మంది కలిసి పనిచేశారు. ప్రతి ఒక్కరూ అందించిన కృషి ఎంతగానో ప్రశంసనీయం అని టీమ్ అందరినీ ప్రశంసించారు.

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలివియా మోరిస్, సముద్ర ఖని, శ్రియ శరణ్, అజయ్ దేవ్‌గన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ 2021 అక్టోబర్ 13 న తెరపైకి రానుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss