Tuesday, March 2, 2021

Latest Posts

భయం నుంచి జాగ్రత్త వైపు మళ్ళించాలంటున్న జక్కన్న

Rajamouli says to turn from fear to caution over coronavirus

కరోనా మహమ్మారి గురించి ప్రపంచవ్యాప్తంగా ఇలా అవుతుందని, ముఖ్యంగా భారత్ లో ఇలా లాక్ డౌన్ అవుతుందని ఎన్నడూ ఊహించలేదని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి చెప్పాడు. కానీ ఒక వ్యక్తి పిలుపు ఇస్తే ఇన్నికోట్ల మంది భారతీయులు ఇంటికి పరిమితం కావడం మామూలు విషయం కాదని అన్నారు. అయితే ఈ వ్యాధి ప్రమాదం కాదని,నిర్లక్ష్యం చేస్తేనే ప్రమాదమని పేర్కొన్నారు. మీడియా కూడా కీలక బాధ్యత వహించి, ప్రజలను అప్రమత్తం చేసిందని అన్నాడు. ఓ టివి ఛానల్ కి ఇచ్చిన ఇంటర్యూలో చాలా విషయాలను ఆయన పంచుకున్నాడు.

అయితే కొన్ని రంగాలను మెల్లిగా పునరుద్ధరిస్తూ మామూలు జీవనం వైపు మళ్లించాల్సిన అవసరం ఉందని జక్కన్న అభిప్రాయపడ్డాడు. భయపడడం నుంచి జాగ్రత్త పాటించే దిశగా మళ్లించేలా దిశగా మీడియా కూడా పాత్ర పోషించాలని అన్నారు. కానీ ఇంతచెబుతున్నా సరే,కొందరు బయటకు రావడం ఉంది కదా అని ప్రశ్నించగా, మరి ఇంకా కొందరు వీధుల్లోకి వస్తున్నారో అర్ధం కావడంలేదని ఆయన వాపోయారు. చిన్న క్లాత్ మీద మరక పడితే ఎలాగో అలాగే 90శాతం మంది లోపల ఉంటున్నా 10శాతం మంది బయటకు తిరగడం వలన ఖచ్చితంగా ఇబ్బంది వస్తుందని ఆయన అన్నారు.

మిగతా దేశాల మాదిరిగా కాకుండా మనదేశంలో నమస్కారానికి గల విలువ ఏమిటో ప్రపంచానికి ఇప్పుడు తెల్సింది జక్కన్న అన్నాడు. ప్రభుత్వ రూల్స్ ని ప్రతిఒక్కరూ పాటించాలని జక్కన్న సూచించారు. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ మిగలడమే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ వర్స్క్ కూడా ఉన్నాయని వీటికి సమయం పడుతుందని సినిమా గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉండే సద్వినియోగం చేసుకుంటున్నానని చెప్పాడు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss