Sunday, June 20, 2021

Latest Posts

ఆర్‌ఆర్‌ఆర్ కు ముందే రాజమౌళి చేయబోతున్న చిన్న సినిమా

Rajamouli To Make Short Film Before RRR Release

డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఆయన సినిమాలు రావడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. తాజాగా అతని అభిమానులు ఆర్ఆర్ఆర్ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల అయ్యే లోపు రాజమౌళి ఒక సినిమా చెయ్యబోతున్నాడట. అయితే అదే వెండి తెర సినిమా కాదు ఒక షార్ట్ ఫిల్మ్.

ఈ మహమ్మారి సమయంలో పనిచేసే పోలీసుల ఆధారంగా ఈ లఘు చిత్రం తీయాలని రాజమౌళి యోచిస్తున్నట్లు వినికిడి. మహమ్మారి సమయంలో పోలీసు శాఖ చేస్తున గొప్ప ప్రయత్నాన్ని దర్శకుడు చూపించాలనుకుంటున్నాడు. కోవిడ్ యొక్క కష్ట కాలంలో తమ విధులను నిర్వర్తించేటప్పుడు చాలా మంది పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఫ్రంట్‌లైన్ కార్మికులందరికీ నివాళిగా రాజమౌళి పోలీసులపై 20 నిమిషాల షార్ట్ ఫిల్మ్ చేయబోతున్నారట.

ఇకపోతే కోవిడ్ భారీన రాజమౌళి కూడా పడ్డాడు అయితే అతను తొందరగానే కోలుకున్నాడు. వాస్తవానికి, ఆర్‌ఆర్‌ఆర్ నటుడు ఎన్‌టిఆర్, రామ్ చరణ్, మరియు అలియా భట్ కు కూడా కోవిడ్ -19 సోకింది. దీనితో రాజమౌళి వారి కష్టాన్ని చూపించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss