Monday, October 25, 2021

Latest Posts

త్వరలో ఇంటికి తిరిగి వస్తాము | జీవిత రాజశేఖర్

టాలీవుడ్ లో కూడా అనేకమంది ప్రముఖులకు కరోనా సోకగా చికిత్స తీసుకొని బయటపడ్డారు. రాజమౌళి – కీరవాణి ల కుటుంబం,  బండ్ల గణేష్, నాగబాబు మరియు తమన్నాలాంటి వారు కరోనా బారిన పడి కోలుకున్నారు. ఈ క్రమంలో ప్రముఖ టాలీవుడ్ జంట రాజశేఖర్ – జీవిత లకు కరోనా సోకిందని వార్తలు వచ్చాయి. రాజశేఖర్ – జీవిత దంపతులకు వారం రోజుల క్రితమే కరోనా సోకగా ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

రీసెంట్ గా రాజశేఖర్ తన ఫ్యామిలీకి కరోనా సోకిందని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ”నాకు జీవిత మరియు పిల్లలకు కరోనా పాజిటివ్ అని నిర్ధారించబడిందని.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామని వస్తున్న వార్తలు నిజమే. పిల్లలు ఇద్దరూ దాని నుండి పూర్తిగా బయటపడ్డారు. జీవిత మరియు నేను చాలా బాగున్నాము. త్వరలో ఇంటికి తిరిగి వస్తాము! ధన్యవాదాలు!” అని రాజశేఖర్ ట్వీట్ చేశాడు.

 ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss