Rajinikanth Shocking Comments On Party Establishment
రాజకీయ రంగ ప్రవేశంపై ఇన్నాళ్లూ ఊరించి త్వరలోనే పార్టీని ప్రకటిస్తానని చెప్పిన తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ మరోసారి యూటర్న్ తీసుకున్నారు. తాను రాజకీయాల్లో వస్తున్నట్టు ఇటీవలే ప్రకటించిన రజినీ కొద్ది రోజుల్లో పార్టీ పేరును వెల్లడిస్తానని తెలిపారు. అయితే తాజాగా మరోసారి యూటర్న్ తీసుకున్నారు. ఆయన అభిమానులకు క్షమాపణలు చెబుతూ, ఇప్పట్లో పార్టీ పెట్టే యోచనలేదని, ఆరోగ్య కారణాల దృష్ట్యా ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు రజినీ తెలిపారు.
కుటుంబసభ్యులు వద్దని వారించినా షూటింగ్లో పాల్గొన్నాను.. అన్ని నిబంధనలు పాటించినా అనారోగ్యానికి గురయ్యానని పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇటువంటి సమయంలో రాజకీయల్లోకి రావాలా? వద్దా అనే సందేహం నెలకుందని అన్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోక పోవడంతో మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు.
అయితే అనారోగ్యం నుంచి కోలుకున్నప్పటికీ ఆయనకు ప్రస్తుతం విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ పార్టీపై వెనక్కుతగ్గినట్టు తెలుస్తోంది. ముందుగా నిర్ణయించిన మేరకు పార్టీ ప్రకటన డిసెంబరు 31న చేయాల్సి ఉంది. కానీ కుటుంబ సభ్యులు
వద్దని వారించడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి: