Sunday, May 16, 2021

Latest Posts

సిఎం పళనిస్వామికి రజనీకాంత్ వార్నింగ్

చెన్నై: తమిళనాడులో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ మద్యం దుకాణాలు తెరవాలన్న సీఎం పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఐడీఎంకే ప్రభుత్వ నిర్ణయంపై ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌ ఫైర్ అయ్యారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూసుకోవాలే తప్ప మద్యం దుకాణాలు తెరవాలనుకోవడం సరికాదని ఒకవేళ మద్యం దుకాణాలు తెరిస్తే మళ్లీ అధికారంలోకి రావాలన్న కల నిజం కాదని హెచ్చరించారు.

మరోపక్క రాష్ట్రంలో మద్యం దుకాణాలను మూసివేయాలని, డోర్‌ డెలివరీ అంశాన్ని పరిశీలించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్‌ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డోర్‌ డెలివరీ సాధ్యం కాదని, ఆదాయం పడిపోతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రజనీ ట్వీట్‌ చేశారు. ఒకవేళ ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరవాలనుకుంటే.. మళ్లీ అధికారంలోకి రావాలన్న కల మరిచిపోవాల్సిందే. ఆదాయం కోసమే అయితే వేరే ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలి అని రజనీ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: మందుబాబులకు షాక్..రమ్‌ బాటిల్‌లో చచ్చిన కప్ప

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss