లాక్ డౌన్లో ఉన్న సినీ తారలు అప్పుడప్పుడు సోషల్ మీడియా లో కొన్ని పోస్ట్ లతో పాటు, ఆన్లైన్ ఇంటర్వ్యూ లతో మరియు తోటి తారాలతో వీడియో కాల్స్ తో హడా విడి చేస్తున్నారు. ఏదే తరహాలో మంచు లక్ష్మి ఈ లాక్ డౌన్ సమయాన్ని కొంచెం వినోదం పంచడానికి తన తోటి తారలను వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తుంది. మొన్న రామ్ గోపాల్ వారం వంతు అయితే తాజాగా అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ వంతు అయ్యింది.
ఈ వీడియో లో మంచు లక్ష్మి ఈ లైవ్ చాలా మంది కుర్రాళ్ళు చూస్తున్నారు అనుకుంటున్న అందుకే ఈ ప్రశ్న అడుగుతున్న అని రకుల్ ప్రీత్ సింగ్ ని నీకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పమని అడగ్గా, రకుల్ నీకు తెలుసు కదా అని దాటవేసే ప్రయత్నం చేసింది. కానీ లక్ష్మి మంచు మళ్ళీ అడిగేసరికి ఇంతక ముందు పెద్ద లిస్ట్ ఉండేదని చెప్పేదాన్ని ఇప్పుడు మాత్రం ఆ లిస్ట్ చాలా చిన్నదైంది, మొత్తానికి అబ్బాయి అయితే చాలు అనేసింది.
ఇది కూడా చదవండి: మళ్ళీ “కిక్” ఇవ్వబోతున్న రవితేజ